డాక్టర్ కారుకు సెలైన్.. సుస్తీ చేసిందని శుభ్రంచేసిన నర్స్

by  |
డాక్టర్ కారుకు సెలైన్.. సుస్తీ చేసిందని శుభ్రంచేసిన నర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వాసుపత్రి వైద్యుడు సెలైన్ బాటిల్ తో కారును శుభ్రం చేయించుకున్న ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రికి రంగులు వేస్తున్న సమయంలో అక్కడే నిలిపి ఉంచిన వైద్యుడి కారుపై సున్నం పడింది. దీంతో అత్యవసర సమయాల్లో రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ బాటిల్‌తో ఆయన కారును ఓ నర్స్ చేత శుభ్రం చేయించుకున్నాడు. అయితే ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైద్యుడు చేసిన ఈ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ వైద్యుడు సెలైన్ బాటిల్ లో నీళ్లు నింపి శుభ్రం చేశామని చెప్పారు.



Next Story

Most Viewed