సోషల్ డిస్టెన్స్‌తో ‘స్కిన్ హంగర్’

by  |
సోషల్ డిస్టెన్స్‌తో ‘స్కిన్ హంగర్’
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా.. ప్రపంచాన్ని మరో కోణంలో చూపిస్తోంది. పరిస్థితులు మునుపటిలా లేవు. అందరూ దూరం దూరంగా బతికేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో అలా ఉండటమే కరెక్ట్. కానీ, మొన్నటి వరకు ఫ్రెండ్స్ కలిస్తే హగ్‌లతో స్వాగతం పలికాం. చేతిలో చేయి వేసుకుని తిరిగాం. ఇక అతిథులు, పెద్దలకు షేక్ హ్యాండ్స్‌ కూడా ఇస్తుండేవాళ్లం. కానీ ఇప్పుడంతా సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల హ్యుమన్ టచ్ లేకుండా పోయింది. దాంతో చాలామంది తీవ్రమైన ‘స్కిన్ హంగర్’ సమస్యను ఎదుర్కొంటున్నారు. హ్యుమన్ టచ్ లేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిడి పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు.

‘శంకరాదాదా’ సినిమాలో చూపించినట్లుగా ఒకరిని హగ్ చేసుకుంటే.. వారికి కొంత సాంత్వన లభిస్తుంది. ఇందులో నిజం లేకపోలేదు. అందుకే ఎవరైనా ఏడుస్తున్నా, బాధపడుతున్నా.. వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చుతారు. అందుకే ‘ఆత్మీయ ఆలింగనం’ అంటారు. అయితే కరోనా కారణంగా.. అందరూ కూడా అలయ్ బలయ్‌కి దూరమవుతున్నారు. దీంతో వారు ఒంటరి వాళ్లమనే ఫీలింగ్‌తో పాటు ఆత్మన్యూనతా భావం పెరిగిపోతూ ఉంది. ఈ ఆలోచన వల్ల వారిలో మానసిక సమస్యలు వస్తున్నాయని సైకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకోవడం వల్ల.. అది చాలా వరకు మానసిక ఆందోళన తగ్గిస్తుందని, బాధను తగ్గించే హార్మోన్లు ఆలింగనం ద్వారా విడుదలవుతాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.

ప్రస్తుతం కరోనా వల్ల చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. అందువల్ల కరోనా గురించి కలవర పడకుండా.. కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే సంతోషంగా గడపాలి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ఇంటో వాళ్ల ఆత్మీయ స్పర్శతో సాంత్వన పొందాలి. అంతేకాదు.. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని హగ్ చేసుకోవడం వల్ల కూడా ఆందోళన తగ్గించుకోవచ్చు. స్కిన్ హంగర్‌కు చెక్ చెప్పొచ్చు.



Next Story