- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్ 2 నుంచి సీపీజీఈటీ
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కామన్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ)ని డిసెంబర్ 2 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు సీపీజీఈటీ షెడ్యూల్‌ను గురువారం ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. వచ్చే నెల 2 నుంచి 11 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ టెస్టులో అర్హత సాధించిన విద్యార్థులు ఎంఏ, ఎంఈడీ, ఎమ్మెస్సీ, ఎం.కామ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రతీరోజూ ఉదయం 9.30-11 గంటల వరకూ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకూ, సాయంత్రం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కామన్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ)ని డిసెంబర్ 2 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు సీపీజీఈటీ షెడ్యూల్‌ను గురువారం ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. వచ్చే నెల 2 నుంచి 11 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ టెస్టులో అర్హత సాధించిన విద్యార్థులు ఎంఏ, ఎంఈడీ, ఎమ్మెస్సీ, ఎం.కామ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రతీరోజూ ఉదయం 9.30-11 గంటల వరకూ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకూ, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్‌ను tscpget.com వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.
Next Story






