ఆడుకునే వయసులో.. అనంత లోకాలకు..

by  |
ఆడుకునే వయసులో.. అనంత లోకాలకు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇళ్లంతా సందడిగా ఉంటుంది….వారు వేసే బుడి బుడి అడుగులు , చిన్న చిన్న మాటలు వింటూ తమ బాధల్ని మర్చిపోతారు తల్లిదండ్రులు. తమ పిల్లలు ఒక నిమిషం కనిపించక పోతేనే అల్లాడి పోతారు. అలాంటిది ఇక లేరు అని తేలిస్తే తట్టుకోగలరా..? ఎవరి నిర్లక్ష్యమో ఏమో కానీ చాక్లెట్ తినాల్సిన వయసులో ఎలకల మందు తిని మరణించింది ఓ పసి పాప. ఆడుకోవాల్సిన వయసులో అనంతలోకాలకు వెళ్లింది.

బిస్కెట్ అనుకుని..

బిస్కెట్ అనుకుని ఎలకల మందు తిని ఐదు సంవత్సరాల పాప మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారెపల్లిలో చోటు చేసుకుంది. రోజులాగే తమ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిన పాపకు దారిలో బిస్కెట్ ప్యాకేట్ లాంటి కవరు దొరికింది. అందులో చిన్నచిన్న బిల్లలు ఉండే సరికి అవి బిస్కెట్స్ అనుకుని తినేసింది. తాను బిస్కెట్ తిన్నాను అనుకుంది కానీ తాను తిన్నది ప్రాణం తీసే ఎలకల మందు అని ఆ చిన్నారికి తెలియదు. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు కూడా చిన్నారిని పసిగట్ట లేకపోయారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

నిరక్ష్యరాస్యత.. నిర్లక్ష్యం..

కొత్త తండాకు చెందిన తేజావత్ మంగీలాల్, శిరీష దంపతులు. వీరిద్దరు నిరక్ష్యరాసులు. ఈ దంపతులకు ఓ పాప, బాబు. ఎప్పటిలాగే మిత్రులతో ఆడుకోని ఇంటికి వచ్చే తన కూతురు ఓ ప్యాకేట్ ను తీసుకొని ఇంటికి వచ్చింది. తాను తెచ్చిన కవరుపై ఉన్న పేరు చదవలేని పాప తల్లిదండ్రులు దానిని తీసి పక్కకు పారేశారు తప్ప.. ప్రమాదాన్ని గుర్తించలేక పోయారు. నిద్రపోయిన పాప ఆ రోజు రాత్రి అస్వస్థకు గురైంది. పాపను సోమవారం ఉదయమే కారెపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు లేక పోయేసరికి చిన్నారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా పాప ప్రాణం దక్కలేదు. తల్లిదండ్రుల నిరక్ష్యరాస్యత, కొంతమంది నిర్లక్ష్యానికి చిన్న పాప ప్రాణాలు విడిచింది.


Next Story

Most Viewed