యాప్ గానే ‘దిశ’ .. పట్టేదెప్పుడు మహర్ధశ..?

by  |
యాప్ గానే ‘దిశ’ .. పట్టేదెప్పుడు మహర్ధశ..?
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టానికి దిశ లేకుండా పోతున్నది. మహిళలు, చిన్నారుల పై లైంగికదాడులు, నేరాల నియంత్రణ కోసం 2019లో సర్కారు ‘దిశ’ పేరిట నూతన చట్టం తెచ్చేందుకు అంకురార్పణ చేసింది. అసెంబ్లీలో శాసన ప్రక్రియ పూర్తయిన అనంతరం కేంద్రం ఆమోదానికి పంపింది.

దేశవ్యాప్తంగా నిర్భయ చట్టం అమలవుతుండగా, దానికి కొన్ని సవరణలు చేసి మరో చట్టం ఏ విధంగా రూపొందిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర వివరాలివ్వాలని ఆదేశించింది. రెండేళ్లవుతున్నా రాష్ట్ర సర్కారు దీనిపై నివేదిక పంపడం లేదు. చివరకు ఒక ‘యాప్‌’‌గానే దిశ మిగిలిపోయింది. కనీసం నూతన ఏడాది లోనైనా ఈ యాప్ చట్టం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed