- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ సంబంధం.. హతమార్చి.. అడవిలో పాతేసి..
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని హత్యచేసి అడవిలో పాతిపెట్టిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం గోకుల్ నగర్ తండాకు చెందిన వెంకట్(26) కనిపించడం లేదని పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులే అతని కోసం వెతికారు. ఈ క్రమంలో శుక్రవారం […]</p>

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని హత్యచేసి అడవిలో పాతిపెట్టిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం గోకుల్ నగర్ తండాకు చెందిన వెంకట్(26) కనిపించడం లేదని పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులే అతని కోసం వెతికారు.
ఈ క్రమంలో శుక్రవారం వెంకట్‌కు చెందిన మోటార్ సైకిల్ నారాయణపేట జిల్లా తిరుమలాపూర్ గ్రామ సమీపంలోని ఓ పాడుబడ్డ బావి దగ్గర ఉన్నట్లు తెలుసుకున్నారు. అనుమానం ఉన్న తండాలోని ఓ కుటుంబం వివరాలు నారాయణపేట పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆ కుటుంబంలోని వ్యక్తులను విచారణ చేయగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. వెంకట్ ఓ యువతిని వివాహం కాకముందు నుంచే ప్రేమించగా.. ఆమెకు పదేళ్ల క్రితం తిరుమలాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. అయినా వెంకట్, ఆ యువతి మధ్య వివాహేతర సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో ఆ యువతి భర్త, సోదరుడు(మైనర్) గుర్తించి పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో వారు వెంకట్‌ను హతమార్చి అడవిలో పూడ్చి వేసినట్లు సమాచారం. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించారు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని శనివారం సాయంత్రం పోలీసులకు చూపించారు. హత్య విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.






