- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
<p>దిశ,గచ్చిబౌలి : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వెనుక గల ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఫుట్‌పాత్ రేకులను ఆనుకుని 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల పురుషుడి మృతదేహం పడిఉంది. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన కేర్ హాస్పిటల్ సెక్యూరిటీ సూపర్‌వైజర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అక్కడికి […]</p>

దిశ,గచ్చిబౌలి : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వెనుక గల ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఫుట్‌పాత్ రేకులను ఆనుకుని 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల పురుషుడి మృతదేహం పడిఉంది. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన కేర్ హాస్పిటల్ సెక్యూరిటీ సూపర్‌వైజర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏదైనా అనారోగ్యంతో కూర్చున్న చోటే సదరు వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు టీ షర్టు, గులాబి రంగు కాటన్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, నడుముకు మొలతాడు ఉందని, రెండు చేతులకు పలు డిజైన్లతో పచ్చబొట్టు ఉందని, అతనిడి గుర్తించిన వారు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.






