మహిళా కానిస్టేబుల్‌ ఛాతిపై చెయ్యేసి.. అలా చేసిన వివాహిత

by  |
lady-Conistable-1
X

దిశ, వెబ్ డెస్క్: ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. నిబంధనలు పాటించని వారిపై చలాన్లు విధిస్తున్నారు. ఈ విషయమై తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ మహిళకు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు గొడవ జరిగింది. ఓ వివాహిత ఆగ్రహంతో మహిళా కానిస్టేబుల్ ను నెట్టివేసింది. ఆ సందర్భంలో పక్కనే ఉన్న మరో మహిళా కానిస్టేబుల్ ఆ మహిళపై చెప్పుతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

mahila-conistable-2

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఏబీ రోడ్‌ సాయాజీ గేట్‌ వద్ద మంగళవారం మాస్క్‌ విషయమై ఓ మహిళకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ మహిళను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఆమె.. మహిళా కానిస్టేబుల్ ను నెట్టివేసింది. అనంతరం ఆమెతో వాగ్వాదానికి దిగింది. దీంతో పక్కనే ఉన్న మరో మహిళా కానిస్టేబుల్ ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Next Story