Bi Sexul Lady : ముగ్గురు అబ్బాయిలు, అమ్మాయితో డేటింగ్

by  |
Bachelorette
X

దిశ, సినిమా: ఆస్ట్రేలియన్ సూపర్ పాపులర్ రియాలిటీ షో ‘ది బ్యాచిలరేట్’ హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. నార్మల్‌గా ఈ షోలో ట్రూ లవ్‌ను కనుగొనే క్రమంలో సింగిల్ ఉమన్‌కు పురుషులతో డేటింగ్ చేసే చాన్స్ ఇస్తారు నిర్వాహకులు. తద్వారా బెస్ట్ పార్ట్‌నర్‌ను ఎన్నుకోవచ్చు. అయితే ఈ సారి ఈ రియాలిటీ ప్రోగ్రామ్‌కు ఎప్పటిలాగే లేడికి కాకుండా బైసెక్సువల్‌ లేడీకి అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు కూడా. దీంతో ఈ న్యూస్ వైరల్ అయిపోగా.. షో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. బైసెక్సువల్ అయిన బ్రూక్ బ్లర్టన్‌ను 2021 బ్యాచిలరేట్‌గా ప్రకటించారు.

దీంతో ఈ సీజన్ మిక్స్‌డ్ జెండర్ కాస్ట్‌తో చరిత్ర సృష్టించనుంది. రియల్ లవ్‌ను కనుగొనేందుకు బ్రూక్ ఈ సీజన్‌లో మహిళలు, పురుషులు ఇద్దరితోనూ డేటింగ్ చేయనుంది. ఆస్ట్రేలియన్ టెలివిజన్ షోలో ఇది అద్భుతం మాత్రమే కాదు, అంతర్జాతీయ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఈ హ్యాపీ న్యూస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన బ్రూక్ బ్లర్టన్‌.. ‘ఈ షో ప్రజలకు ఏ విధంగానైనా అసౌకర్యంగా అనిపిస్తే, ఎందుకు అలా జరుగుతుందో ఆలోచించమని చాలెంజ్ చేస్తాను’ అని తెలిపింది. కాగా ‘ది బ్యాచిలర్ 2018’ షోలో పాల్గొన్న బ్రూక్ బ్లర్టన్‌ తను బైసెక్సువల్ అని రివీల్ చేసింది. ముగ్గురు అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయితో కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వివరించింది.

https://www.instagram.com/p/CPFWjoUnefE/?utm_source=ig_web_copy_link



Next Story