- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యమైన విద్య అందించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం
విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు.

దిశ, వెల్దండ : విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని వందే మాతరం ప్రభుత్వ కళాశాలలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక భాగంగా ఐఎఫ్ పీ/ఐడీపీ ఎల్ఇడి టీవీ ద్వారా విద్యార్థులకు విద్యాభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. కళాశాల స్థాయి నుంచే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి కళాశాలలో కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారన్నారు. విద్యార్థులు అన్ని పరీక్షలలో 100% శాతం ఉత్తీర్ణతతో పాటు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ ఉమా మనీలా సంజీవ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ రావు, ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను, వార్డు సభ్యులు పసునోజు వాణి పురుషోత్తంచారి, గుద్దటి కిష్టల్, పాలాది మల్లీశ్వరి రంగనాథం, గోసుల కొండల్, మసిగుండ్ల వెంకటేష్, మారేపల్లి శ్రీను, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, తిరుపతి రెడ్డి, గొడుగు చంద్ర శేఖర్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.






