- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థాంక్యూ అమితాబ్ సాబ్.. మీ వల్లే నేను విమానమెక్కాను
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు. సొంత ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న వలస కూలీలకు సాయం చేశాడు. ప్రత్యేక విమానాల్లో వారిని వారి గమ్యస్థానాల్లోకి చేర్చారు. మహారాష్ట్రలో ఇరుక్కుపోయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కూలీలను బుధవారం ప్రత్యేక విమానాల ద్వారా వారిని వారివారి సొంతఊర్లకు చేర్చారు. ఈ సందర్భంలో ఓ వలస కూలీ ఓ విషయాన్ని ప్రస్తావించాడు. ‘లాక్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు. సొంత ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న వలస కూలీలకు సాయం చేశాడు. ప్రత్యేక విమానాల్లో వారిని వారి గమ్యస్థానాల్లోకి చేర్చారు. మహారాష్ట్రలో ఇరుక్కుపోయిన ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కూలీలను బుధవారం ప్రత్యేక విమానాల ద్వారా వారిని వారివారి సొంతఊర్లకు చేర్చారు. ఈ సందర్భంలో ఓ వలస కూలీ ఓ విషయాన్ని ప్రస్తావించాడు. ‘లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అమితాబ్ బచ్చన్ వల్ల మేం మా గమ్యస్థానాలకు చేరుకోగలిగాము. అదేవిధంగా నేను ఇంతకుముందెప్పుడూ విమానం ఎక్కలేదు.. అమితాబ్ బచ్చన్ వల్లే నేను విమానం ఎక్కగలిగాం.. అమితాబ్ సాబ్ థాంక్యూ’ అని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ వలస కూలీ అన్నాడు.
Next Story






