తమన్‌ను ఫాలో అవుతున్న పవన్…

by Shyam |   (  Updated:2020-04-04 03:50:44  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఆనందంతో గంతులేస్తున్నాడు. కలలో కూడా ఊహించని ఘటన జరిగిందంటూ డ్యాన్స్ వేసినంత పనిచేశాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ సినిమాకు సంగీతం అందించడాన్నే ఓ అదృష్టంగా భావించిన తమన్&#8230;. అంతకు మించిన ఆనందాన్ని పొందాడు. తొలిసారి పవన్‌ను కలిసినప్పుడు ఫ్యాన్ మోమెంట్ షేర్ చేసుకుని తెగ సంబరపడిపోయిన తమన్&#8230;. దానికి మించిన గొప్ప సంఘటనను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పవన్ లాంటి వ్యక్తి తనకు మెస్సేజ్, [&hellip;]</p>

తమన్‌ను ఫాలో అవుతున్న పవన్…
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఆనందంతో గంతులేస్తున్నాడు. కలలో కూడా ఊహించని ఘటన జరిగిందంటూ డ్యాన్స్ వేసినంత పనిచేశాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ సినిమాకు సంగీతం అందించడాన్నే ఓ అదృష్టంగా భావించిన తమన్…. అంతకు మించిన ఆనందాన్ని పొందాడు. తొలిసారి పవన్‌ను కలిసినప్పుడు ఫ్యాన్ మోమెంట్ షేర్ చేసుకుని తెగ సంబరపడిపోయిన తమన్…. దానికి మించిన గొప్ప సంఘటనను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పవన్ లాంటి వ్యక్తి తనకు మెస్సేజ్, కాల్ చేయడమే ఎక్కువ అని భావించే తమన్… జనసేనాని తనను ఫాలో అవుతున్నాడని తెలిసి నోట మాటరాలేదట. పవన్ ట్విట్టర్‌లో తమన్‌ను ఫాలో కావడాన్ని చూసి మురిసిపోయిన తమన్… అదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తన లైఫ్‌లో జరిగిన అతిపెద్ద సంతోషకరమైన సంఘటనల్లో ఇది కూడా ఒకటని…. రోజును ప్రారంభించేందుకు ఇంత కన్నా పెద్ద విషయాన్ని ఆశించడం లేదంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ధన్యవాదాలు సార్.. లవ్ యూ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్… ఈ ఆనందంలో వకీల్ సాబ్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. పవర్ స్టార్ సినిమాకు ఓ రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: S Thaman, Pawan Kalyan, Power Star, Fan Moment

Next Story