రక్తపు మరకలతో విజయ్.. నెట్టింట ఫొటోలు వైరల్

by  |
రక్తపు మరకలతో విజయ్.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: హీరో తలపతి విజయ్-డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘బీస్ట్’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ‘మాస్టర్’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ హైగా ఉన్నా.. లీకింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని బ్రిస్క్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అన్‌అఫిషియల్‌గా మూవీ కంటెంట్ రిలీజ్ కావడం ఇది రెండో సారి కాగా.. వైట్ కలర్ షర్ట్‌పై రక్తపు మరకలతో రోరింగ్ అవతార్‌లో కనిపిస్తున్న విజయ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.

దీనిపై స్పందించిన హీరో విజయ్.. అన్‌అఫిషియల్ ఫొటోలు, వీడియోలను షేర్ చేయొద్దని ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేశాడు. కాగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. సెల్వ రాఘవన్, షైన్ టామ్ చకో, యోగి బాబు, అపర్ణ దాస్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed