సోషల్ మీడియా షార్ట్‌కట్‌లు

by  |
సోషల్ మీడియా షార్ట్‌కట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెద్ద పెద్ద వాక్యాలు రాయడం ఈరోజుల్లో యువతకు అస్సలే ఇష్టం ఉండదు. ఏదైనా షార్ట్‌కట్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అందుకే సోషల్ మీడియా పోస్టుల్లో కూడా పెద్ద వాక్యాలు కనిపించవు. అన్ని అబ్రివేషన్‌లే ఉంటాయి. అయితే వాటికి అర్థం తెలిసిన వాళ్లు సరే.. మరి అర్థం తెలియని వారి సంగతేంటి? మళ్లీ దాని గురించి గూగుల్‌లో వెతికి తెలుసుకోవాలి. అలాంటి కష్టం లేకుండా సోషల్ మీడియాలో విరివిగా కనిపించే కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లకు అర్థాలను మీకోసం అందిస్తున్నాం.

TBT – త్రో బ్యాక్ థర్స్‌డే (గురువారం రోజున పాత ఫొటోలు పోస్ట్ చేసి ఈ ట్యాగ్ పెడతారు.)
TBH – టు బి హానెస్ట్ (నిజాయతీగా చెప్పాలంటే)
SMH – షేకింగ్ మై హెడ్ (తల తిరుగుతోంది)
FF – ఫాలో ఫ్రైడే (శుక్రవారం రోజున ట్విట్టర్‌లో ఒకరినొకరు ఫాలో అవడం)
LMAO, LMFAO – లాఫింగ్ మై యా* ఆఫ్, లాఫింగ్ మై ఫ* యా* ఆఫ్ (విరగబడి నవ్వడం)
LOL – లాఫింగ్ అవుట్ లౌడ్ (గట్టిగా నవ్వడం)
YOLO – యూ ఓన్లీ లివ్ వన్స్ (ఉన్నది ఒక్కటే జీవితం)
DM – డైరెక్ట్ మెసేజ్ (నేరుగా మెసేజ్ చేయడం)
LBH – లెట్స్ బీ హానెస్ట్ (నిజాయితీగా మాట్లాడుకుందాం)
IMO – ఇన్ మై ఒపీనియన్ (నా అభిప్రాయంలో)
IRL – ఇన్ రియల్ లైఫ్ (నిజజీవితంలో)
AMA – ఆస్క్ మీ ఎనీథింగ్ (నన్ను ఏదైనా అడగండి)
BRB – బీ రైట్ బ్యాక్ (ఇప్పుడే వస్తాను)
BTS – బిహైండ్ ద సీన్స్ (చిత్రీకరణ దృశ్యాలు)
DYK – డిడ్ యూ నో (మీకు తెలుసా)
FOMO – ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (కోల్పోతామన్న భయం)
FYI – ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ (మీ సమాచారార్థం)
WFH – వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి పని)
TGIF – థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే (వీకెండ్ రాబోతోందని తెలిసి శుక్రవారం పొందే ఆనందం)
411 – ఇన్ఫర్మేషన్ సీక్రెట్ కోడ్ (సమాచారం)
AF – యా* ఫ* (అతి భావోద్వేగాన్ని చూపించడం)
BAE – బిఫోర్ ఎనీవన్ ఎల్స్ (అందరికంటే నువ్వే ఎక్కువ)
FML – ఫ* మై లైఫ్ (జీవితం దరిద్రంగా ఉందనే సందర్భంలో వాడతారు)
IDK – ఐ డోంట్ నో (నాకు తెలియదు)
ROFL – రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ లాఫింగ్ (కిందపడి దొర్లి నవ్వుతున్నా)
SRSLY – సీరియస్‌లీ (సీరియస్‌గా)
TIL – టుడే ఐ లెర్న్‌డ్ (ఇవాళ నేను ఇది నేర్చుకున్నా)
TMI – టూ మచ్ ఇన్ఫర్మేషన్ (చెప్పాల్సినదాని కన్నా ఎక్కువ సమాచారం)
TY – థ్యాంక్యూ
WTF – వాట్ ద ఫ* (ఏంటిదంతా…)

Next Story

Most Viewed