సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటించాలి: టీఈఏ

by  |
సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటించాలి: టీఈఏ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు సీఎం కేసీఆర్​ తరుపున సంక్రాంతి పండుగ కానుక కోసం ఎదురుచూస్తున్నారని, పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి అన్నారు. పీఆర్సీ అంశం ఇంకా తేల్చడం లేదని, ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు నివేదిక కాపీ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఈఓ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఉద్యోగవర్గాలు ఉద్యమ సమయంలో వచ్చే పండుగలన్నీ స్వరాష్ట్రంలోనే జరుపుకుంటామనే ఆశతో ఉండేవారని, ఇప్పుడు కూడా రెండేండ్ల నుంచి పీఆర్సీకి కోసం అదే విధంగా ఎదురుచూస్తున్నారన్నారు. 2018 జూన్​ నుంచి పీఆర్సీ అంశం తేలడం లేదని, వేతన సవరణ కమిషన్​ నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు చర్చించడం లేదని సంపత్ కుమారస్వామి ప్రశ్నించారు. ఉద్యోగ వర్గాల సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్​ తొలిసారి 42 శాతం ఫిట్​మెంట్​ ఇచ్చారని, ఈసారి కూడా అదే ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు.


Next Story