- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల గ్రేడ్ల వివరాలను జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ సెలక్ట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల గ్రేడ్ల వివరాలను జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ సెలక్ట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేసినట్లు తెలిపారు.
గ్రేడు ఇచ్చేందుకు ఛాయారతన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో గ్రేడ్లు ఇచ్చినట్లు తెలిపారు. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా గ్రేడ్లు విభజించినట్టు మంత్రి స్పష్టం చేశారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం జరగదని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.






