- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూములు సర్వే నెంబర్ 24, 25, 26లో ఏడు ఎకరాల 13గుంటల భూమిలో ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. 1951 నుంచి ఆ భూములు దేవాదాయశాఖ ఆధినంలో ఉన్నాయని వెంటనే నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అయితే ఈ భూములను తనకు ఆలయ ట్రస్ట్ అమ్మిందంటూ ఆ వ్యక్తి పోలీసుల సాయంతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూములు సర్వే నెంబర్ 24, 25, 26లో ఏడు ఎకరాల 13గుంటల భూమిలో ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. 1951 నుంచి ఆ భూములు దేవాదాయశాఖ ఆధినంలో ఉన్నాయని వెంటనే నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అయితే ఈ భూములను తనకు ఆలయ ట్రస్ట్ అమ్మిందంటూ ఆ వ్యక్తి పోలీసుల సాయంతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. మళ్లీ స్థానికులు భూముల్లోకి వెళ్లి బైఠాయించడంతో వారికి మద్దతు తెలిపేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్లారు. పోలీసులు భారీగా మోహరించి స్థానికులను చెదరగొడుతున్నారు.
Next Story






