- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వకీల్ సాబ్'కు షాక్.. అక్కడ షోలు నిలిపివేత
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వకీల్ సాబ్ ధియేటర్లలో విడుదలైంది. చాలారోజుల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అవ్వడంతో.. థియేటర్ల వద్ద టపాసులు పేలుస్తూ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. థియేటర్ల వద్దకు భారీగా ఫ్యాన్స్ చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వకీల్ సాబ్ ధియేటర్లలో విడుదలైంది. చాలారోజుల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అవ్వడంతో.. థియేటర్ల వద్ద టపాసులు పేలుస్తూ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. థియేటర్ల వద్దకు భారీగా ఫ్యాన్స్ చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే కరోనా నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు రద్దయ్యాయి. దీంతో తిరుపతిలోని శాంతి థియేటర్లపై పవన్ ఫ్యాన్స్ రాళ్లతో దాడికి దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 8 గంటలకు ప్రదర్శించాల్సిన సాధారణ షోలను నిలిపివేయాలని థియేటర్ల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Next Story






