- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుధారాణి హత్య: భర్త ఇంటివద్ద ఉద్రిక్తం..
<p>దిశ, కామారెడ్డి : హైదరాబాద్ ప్రగతినగర్ లో కిరణ్ అనే వ్యక్తి తన భార్య సుధారాణి గొంతు కోసి హత్య చేసిన ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది. సుధారాణి సొంత గ్రామం గాంధారి మండలం తిమ్మాపూర్. అయితే గ్రామానికి చెందిన సుమారు 300 మంది గ్రామస్థులు కామారెడ్డి పట్టణంలోని శ్రీరంనాగర్ కాలనీలో ఉన్న సుధారాణి భర్త కిరణ్ కుమార్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. మృతురాలి బంధువులు, గ్రామస్థులు పెద్ద […]</p>

దిశ, కామారెడ్డి : హైదరాబాద్ ప్రగతినగర్ లో కిరణ్ అనే వ్యక్తి తన భార్య సుధారాణి గొంతు కోసి హత్య చేసిన ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది. సుధారాణి సొంత గ్రామం గాంధారి మండలం తిమ్మాపూర్. అయితే గ్రామానికి చెందిన సుమారు 300 మంది గ్రామస్థులు కామారెడ్డి పట్టణంలోని శ్రీరంనాగర్ కాలనీలో ఉన్న సుధారాణి భర్త కిరణ్ కుమార్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. మృతురాలి బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున కామారెడ్డికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మాకు న్యాయం కావాలి అంటూ కిరణ్ కుమార్ ఇంటి గేటుకు బంధువులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఉన్న కూతురును చూస్తూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల రోదనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు, బంధువులు ఇంటి గేటును తోసుకుని ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆగ్రహంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను బయటకు లాగేసారు. కొందరు మహిళలు రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి.







