నేటి రాత్రి నుంచి శ్రీకాళహస్తి మినహా గుళ్లన్నీ మూత

182

దిశ, ఏపీ బ్యూరో: నేటి అర్థరాత్రి నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయం తప్ప ఆంధ్రప్రదేశ్‌లోని గుళ్లన్నీ మూతపడనున్నాయి. ఈ నెల 21వ తేదీ అంటే రేపు సూర్య గ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణం ఉదయం 10.25 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకూ ఏర్పడుతుంది. దీని ప్రభావం వృషభ, మిధున రాశులతో పాటు జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుధ్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1, 2, 3 పాదాల వారిపై తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అందుకే నేటి అర్థరాత్రి చేసే పూజల అనంతరం అన్ని దేవాలయాలకు తాళాలు వేయనున్నారు. సంప్రోక్షణ అనంతరం అంటే సోమవారం తిరిగి దేవాలయాలను భక్తుల కోసం తెరవనున్నారు. పైన చెప్పిన రాశులు, నక్షత్రాల్లో పుట్టిన వారికి ఈ సూర్య గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. గ్రహణం సమయంలో ఏమీ తినకుండా ఉండాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు, అభిషేకాలు యధావిధిగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం దేవాలయాలు మాత్రం మూసుకోనున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..