తెలంగాణలో ఆలయాలు బంద్​

by  |
తెలంగాణలో ఆలయాలు బంద్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో భద్రాద్రి సీతారామచంద్ర ఆలయం, యాదాద్రి లక్ష్మీనర్సింహ దేవస్థాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఈ నెల 21 వరకూ భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి దర్శనాలను నిలిపేస్తున్నామని దేవస్థానం అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఆంతరంగికంగా మాత్రం స్వామి నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని ఈవో ప్రకటించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగానే ఈ నిర్ణయమని వెల్లడించారు.

యాదాద్రిలో కూడా..

లాక్‌డౌన్​తో యాదాద్రి దేవస్థానంలో దర్శనాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని, అయితే ఆంతరంగికంగా స్వామి వారి నిత్య కైంకర్యాలు మాత్రం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. వీటితో పాటుగా మరిన్ని దేవాలయాలు కూడా భక్తుల దర్శనాలను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వరకు దర్శనాలకు అవకాశం కల్పించి ఆ తర్వాత నిలిపివేయనున్నారు.


Next Story

Most Viewed