భద్రకాళి ఉత్సవాలకు రండి… సీఎంకు ఆహ్వానం

by  |   (  Updated:2020-10-15 06:56:45  IST  )

<p>దిశ, వరంగల్ సిటీ: వరంగల్ మహానగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ నుంచి ఘనంగా జరిగే &#8216;దేవీ నవరాత్రి మహోత్సవాలకు&#8217; రావాలని సీఎం కేసీఆర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ మేరకు గురువారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. వీరి వెంట ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ఈవో సునీత, ముఖ్య అర్చకులు [&hellip;]</p>

భద్రకాళి ఉత్సవాలకు రండి… సీఎంకు ఆహ్వానం
X

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ మహానగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ నుంచి ఘనంగా జరిగే ‘దేవీ నవరాత్రి మహోత్సవాలకు’ రావాలని సీఎం కేసీఆర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ మేరకు గురువారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. వీరి వెంట ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ఈవో సునీత, ముఖ్య అర్చకులు నాగరాజశర్మ ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఉత్సవాల పోస్టర్లను కేసీఆర్ ఆవిష్కరించారు.

Next Story