- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 ప్రపంచకప్‌లో యువ్‌రాజ్ సమ్రా సరికొత్త రికార్డు.. న్యూజిలాండ్‌పై విధ్వంసకర సెంచరీ
టీ20 వరల్డ్ కప్‌లో యువ్‌రాజ్ సమ్రా రికార్డ్ సెంచరీతో రెచ్చిపోయాడు. న్యూజిలాండ్‌పై 110 రన్స్ చేసి.. టీ20 ప్రపంచకప్‌లో అతి పిన్న వయస్కుడిగా కెనడా బ్యాటర్ చరిత్ర సృష్టించాడు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో కేనడ బ్యాటర్ (Canadian batter) న్యూజిలాండ్‌పై విధ్వంసకర సెంచరీ (devastating century) చేసి రికార్డు సృష్టించాడు. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్-డి మ్యాచులో కెనడా బ్యాటర్ యువ్‌రాజ్ సమ్రా (Yuvraj Samra) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 58 బంతుల్లోనే తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసిన యువ్‌రాజ్, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 141 రోజులు) చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ (22 ఏళ్ల 127 రోజులు) పేరిట ఉండేది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆయన 65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెనడా, యువ్‌రాజ్ సమ్రా (Yuvraj Samra) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా 36 పరుగులు చేసి యువ్‌రాజ్‌కు చక్కని సహకారం అందించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక అసోసియేట్ దేశానికి చెందిన బ్యాటర్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఈ లక్ష్యాన్ని ఛేదించి సూపర్-8 రేసులో నిలవాలని చూస్తోంది. అదే సమయంలో ఈ భారీ స్కోరును కాపాడుకుని కివీస్‌కు షాక్ ఇవ్వాలని కెనడా పట్టుదలతో ఉంది.






