మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమునాం కేంచంద్

by Gantepaka Srikanth |

ఉత్కంఠకు తెరపడింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను బీజేపీ పూర్తిచేసింది.

మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమునాం కేంచంద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠకు తెరపడింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను బీజేపీ పూర్తిచేసింది. కొత్త ముఖ్యమంత్రిగా యుమునాం కేంచంద్‌(Manipur Chief Minister Yumunaman Khemchand)ను ఎంపిక చేసింది. దీంతో మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. కాగా, మణిపూర్ అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను బీజేపీకి 37 మంది సభ్యుల బలం ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా, ఇటీవల జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు బీజేపీలో చేరారు. ఇతర పార్టీల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు ఐదుగురు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఐదుగురు, కుకీ పీపుల్స్ అలయెన్స్ (కేపీఏ)కు ఇద్దరు సభ్యులు ఉండగా, ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఒక సీటు ఖాళీగా ఉంది. తాజాగా మణిపూర్‌లో రెండోసారి రాష్ట్రపతి పాలన ముగియనుండటంతో మణిపూర్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా యుమునాం కేంచంద్‌ను ఎంపిక చేశారు.

ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో కొంతకాలం క్రితం మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.

Next Story