- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ తన కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ తన కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. అలాగే తన ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ నాణ్యతను పెంచడానికి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం యూట్యూబ్ మానిటైజేషన్‌ను రెండు దశలుగా విభజించింది, దీనివల్ల కొత్తగా ఛానెల్ మొదలుపెట్టిన వారు కూడా త్వరగా ఆదాయం పొందే అవకాశం ఉంది. మొదటి దశలో ఛానెల్‌కు 500 సబ్‌స్క్రైబర్లు, 3,000 గంటల వాచ్ టైమ్ లేదా 30 లక్షల షార్ట్స్ వ్యూస్ ఉంటే.. సూపర్ థాంక్స్, ఛానెల్ మెంబర్‌షిప్స్, షాపింగ్ ఫీచర్ల ద్వారా నేరుగా డబ్బులు పొందవచ్చు. అయితే వీడియోల మధ్యలో వచ్చే ప్రకటనల (Ads) ద్వారా పూర్తిస్థాయిలో సంపాదించాలంటే మాత్రం పాత నిబంధనల ప్రకారమే 1,000 సబ్‌స్క్రైబర్లు, 4,000 గంటల వాచ్ టైమ్ లేదా కోటి షార్ట్స్ వ్యూస్ కచ్చితంగా ఉండాలి.
ఈ మార్పుల్లో అత్యంత ముఖ్యమైనది "ఇనాథెంటిక్ కంటెంట్" (Inauthentic Content) అనే కొత్త రూల్. దీని ప్రకారం, వేరే వాళ్ల వీడియోలను కాపీ చేసి పెట్టడం, కేవలం AI టూల్స్ ఉపయోగించి బొమ్మలతో వీడియోలు చేసి పంపడం వంటి వాటికి యూట్యూబ్ ఇకపై రూపాయి కూడా ఇవ్వదు. ఒక వీడియో మానిటైజ్ అవ్వాలంటే అందులో క్రియేటర్ యొక్క సొంత సృజనాత్మకత, వాయిస్ ఓవర్, విశ్లేషణ స్పష్టంగా ఉండాలి. అంటే వేరే సమాచారాన్ని వాడుకున్నా దానికి మీ సొంత తెలివితేటలను జోడించి ఒక కొత్త రూపం ఇస్తేనే అది అసలైన వీడియోగా పరిగణించబడుతుంది. అలాగే మీరు వీడియోలో AIని ఉపయోగించి ఏదైనా దృశ్యాన్ని లేదా వాయిస్‌ను సృష్టించినట్లయితే, అది AI ద్వారా తయారు చేయబడిందని ప్రేక్షకులకు ముందే చెప్పాలి (Disclosure). ఒకవేళ ఈ విషయాన్ని దాచిపెట్టి ప్రేక్షకులను మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే, యూట్యూబ్ ఆ వీడియోను తీసేయడమే కాకుండా మీ ఛానెల్‌పై కఠిన చర్యలు తీసుకుంటుందని యూట్యూబ్ పేర్కొంది.






