- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ హ్యాక్ అవుతున్నాయా?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ హ్యాకింగ్ కి గురవుతున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన యూట్యూబ్(YouTube) సేవలు నిలిచిపోయాయి. మరియు X (ట్విట్టర్) లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫిబ్రవరి 17 సాయంత్రం యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఔటేజ్ అని చెబుతున్నారు. దీనిపై యూజర్స్ పలు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా యూజర్లు తమ సమస్యను రిపోర్ట్ చేశారు. ఒక్క అమెరికాలోనే 2.4 నుండి 3.2 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయి. యూట్యూబ్ ఓపెన్ అవకుండా "Something went wrong" అనే ఎర్రర్ మెసేజ్ చూపించిందని పేర్కొన్నారు. యాప్ మరియు వెబ్‌సైట్ లోడ్ కాకపోవడం, వీడియోలు ప్లే అవకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. YouTube TV కూడా ఈ సమస్యకు గురైంది. ఇండియా, UK, కెనడా, బ్రెజిల్ వంటి అనేక దేశాల్లో ఈ ఇష్యూస్ కనిపించాయి.
దీనిపై స్పందించిన యూట్యూబ్.. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే తెలిపింది. కాగా రాయిటర్స్, టెక్ రీడర్స్ వంటి అంతర్జాతీయ మీడియా దీనిని సాధారణ టెక్నీకల్ గ్లిచ్ గా అభివర్ణించాయి. ఇందులో ఎలాంటి హ్యాకర్స్ కుట్ర లేదని తెలిపాయి. అదే విధంగా ఫిబ్రవరి 16న ఎక్స్ కూడా కొన్ని గంటల పాటు ఔటేజ్ కి గురైంది. నమోదైంది. 2 గంటల పాటు ఫీడ్ రిఫ్రెష్ కాకపోవడం, లాగిన్ సమస్యలు, యాప్ లోడ్ అవకపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పీక్ అవర్ లో 40,000కు పైగా రిపోర్టులు నమోదయ్యాయి. కాగా దీనిపై 'X' కూడా అధికారికంగా స్పష్టమైన కారణం చెప్పలేదు.
అయితే ఈ రెండు సందర్భాల్లోనూ హ్యాకింగ్ గాని డేటా బ్రీచ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. పెద్ద ప్లాట్‌ఫామ్స్‌కి ట్రాఫిక్ పెరగడం, సర్వర్ మెయింటెనెన్స్, క్లౌడ్ సర్వీస్ సమస్యలు, నెట్‌వర్క్ లోపాలు వంటి కారణాల వల్ల అప్పుడప్పుడూ ఇలాంటి ఔటేజెస్ రావడం సాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ హ్యాకింగ్ జరిగితే డేటా లీక్, అకౌంట్ సస్పెన్షన్, సెక్యూరిటీ అలర్ట్స్ కనిపిస్తాయి. యూట్యూబ్, ఎక్స్ ఔటేజ్ లో అలాంటివేవీ కనబడక పోవడంతో ఇవి సాధారణ సాంకేతిక లోపాలే అని చెప్పవచ్చు.






