- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
by Batti.Sumithra |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ వడ్డెర కాలనీ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, చేగుంట : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ వడ్డెర కాలనీ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చేగుంట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన అరవింద్ కర్నల్ పల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపూర్ వడ్డెర కాలనీ వద్ద ట్రాక్టర్ అడ్డుగా రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అరవింద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అరవింద్ మృతితో పులిమామిడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






