- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. ట్యాంక్‌బండ్‌పై రేపు ట్రోఫీ ఆవిష్కరణ
హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో క్రికెట్ (Cricket) ఫీవర్ మొదలుకానుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 (TG20) లీగ్’ మొదటి సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ టోర్నమెంట్‌ను విస్తతంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ మేరకు విషయాన్ని ఇవాళ హెచ్‌సీఏ అధికారికంగా ప్రకటించింది. ఈ సూపర్ టీజీ20 లీగ్ ప్రముఖ విద్యాసంస్థ ‘శ్రీనిధి యూనివర్సిటీ’ (Sreenidhi University) టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. లీగ్ ప్రారంభానికి ముందే భాగ్యనగరంలో సందడి మొదలుకానుంది. టోర్నమెంట్‌లో విజేతకు అందించే మెరిసే విన్నర్స్ ట్రోఫీని బుధవారం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు హెచ్‌సీఏ ప్రతినిధులతో పాటు క్రీడా, సినీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు.






