- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPSC paper leak: యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 పేపర్ లీక్ ఆరోపణలు.. పీఐబీ (PIB) స్పష్టీకరణ
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం పేపర్ లీక్ ఆరోపణలను ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
ఎన్ఎస్‌యూఐ (NSUI) తీవ్ర ఆరోపణలు:
యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లోని 100 ప్రశ్నల్లో 82 ప్రశ్నలు ‘అనంతం ఐఏఎస్’ (Anantam IAS) అనే కోచింగ్ సెంటర్ స్టడీ మెటీరియల్‌కు సరిపోలాయని ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ ఆరోపించారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఆ కోచింగ్ సెంటర్ తమ నోట్స్‌కు సంబంధించిన తేదీలను (backdating) మార్చిందని, కోచింగ్ సెంటర్లకు, వారికి మధ్య కుమ్మక్కు జరిగిందనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై యూపీఎస్సీ పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) వివరణ..
ఎన్ఎస్‌యూఐ ఆరోపణలను ‘ఫేక్ న్యూస్’గా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ @PIBFactCheck ఎక్స్ వేదికగా తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయా సబ్జెక్టుల నిపుణులతో మాత్రమే అత్యంత కట్టుదిట్టంగా యూపీఎస్సీ ప్రశ్నపత్రాలను రూపొందిస్తుందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థ ఇచ్చిన వివరణ లింక్‌ను కూడా పీఐబీ షేర్ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే ఆధారరహితమైన తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని, కేవలం అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పీఐబీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనుమానాస్పద సమాచారం ఏదైనా ఉంటే పీఐబీ వాట్సాప్ నెంబర్ +91 8799711259 లేదా [email protected] కు ఈ-మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయాలని సూచించింది. కాగా, దేశంలో NEET UG -2026 నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన మరువక ముందే తాజాగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు తీవ్ర చర్చానీయాంశంగా మారింది.






