- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం..సెల్ఫీ వీడియో చిత్రీకరణ
దిశ, తాండూర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు శుక్రవారం గొంతు కోసుకుని.. Latest Telugu News..

X
దిశ, తాండూర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు శుక్రవారం గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గొంతు కోసుకున్న అనంతరం యువకుడు సెల్ఫీ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో నగరంలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న వాంకిడి ఎస్ఐ ఢీకొండ రమేష్ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన స్థలాన్ని కనుక్కొని అక్కడకు వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నించాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story






