ప్రారంభమైన యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు

by Disha Web |
ప్రారంభమైన యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
X

దిశ,భువనగిరి రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజులో భాగంగా శ్రీ విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం పూజలు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు అర్చకులు ప్రారంభించారు.

ప్రధానాలయా పునర్నిర్మాణం పనులు జరుగుతుండటంతో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రధానాలయ గర్భాలయంలో స్వయంభూ నరసింహునికి పూజలు జరిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా పదకొండు రోజుల పాటు భక్తులచే జరుపబడే శాశ్వత, మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమంను రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed