Xiaomi స్మార్ట్ హోమ్ డేస్ సేల్‌.. 80% తగ్గింపు ధరలు

by Disha Web Desk 17 |
Xiaomi స్మార్ట్ హోమ్ డేస్ సేల్‌.. 80% తగ్గింపు ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: Xiaomi సంస్థ వినియోగదారులను ఆకట్టుకొడానికి సరికొత్త స్మార్ట్ హోమ్ డేస్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో గరిష్టంగా స్మార్ట్ హోమ్ పరికరాలపై 80% తగ్గింపు పొందవచ్చు. Mi.com, Mi Home, Flipkart, Amazonతో సహా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. Xiaomi స్మార్ట్ హోమ్ డేస్ సేల్‌ మార్చి 7న ప్రారంభమై మార్చి 10న ముగుస్తుంది. ఈ సేల్ సమయంలో, వినియోగదారులు స్మార్ట్ హోమ్ పరికరాలపై డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను పొందుతారు. "ఆఫర్లు, డిస్కౌంట్‌లు పుష్కలంగా ఉన్నాయి! అద్భుతమైన #SmartHomeDays ను తీసుకొచ్చినట్లు Xiaomi ఇండియా మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

Mi Robot Vacuum-Mop, Mi Home Security Camera 360-degree 1080p, Mi Smart Water Purifier(RO+UV), Mi LED Smart Bulb, Mi Smart LED డెస్క్ వంటి డివైజ్‌లు డిస్కౌంట్‌లలో లభిస్తాయి. అదనంగా, కస్టమర్‌లు Mi.comలో ప్రత్యేకంగా తక్షణ తగ్గింపు కూపన్‌లు, ఎక్స్‌ఛేంజ్ బంప్-అప్ ఆఫర్‌లను కూడా పొందుతారు. ఈ 4-రోజుల సేల్‌లో, Xiaomi ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు Wipe Out Sale ను నిర్వహిస్తుంది. ఇక్కడ వినియోగదారులు ప్రతి 2 పరికరాలపై ప్రత్యేక తగ్గింపులను పొందవచ్చు.

"Xiaomi- Mi Robot Vacuum-Mop P స్మార్ట్ హోమ్ క్లీనింగ్ సొల్యూషన్ రూ. 19,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. Mi హోమ్ సెక్యూరిటీ కెమెరా 360-డిగ్రీ 1080p రూ. 2,799కి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు Mi Smart Water Purifier (RO+UV)ను రూ. 2,000 తగ్గింపుతో, Mi Air Purifier 3ని రూ. 1,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.



Next Story

Most Viewed