- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలు అన్ని రంగాల్లో వారితో పోటీ పడటం గొప్ప విషయం: బి. పాపిరెడ్డి
by Satheesh |
దిశ, కంది: మహిళా దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు.- latest Telugu news

X
దిశ, కంది: మహిళా దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు. మంగళవారం డీఎస్ఎల్ఏ, ఉమ్మడి మెదక్ జిల్లా జుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కోర్టులో వివిధ విభాగాల్లో పని చేసే మహిళలకు శాలువాలతో సన్మానించారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతుండడం గొప్ప విషయమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అందరితో పోటీపడి అన్ని రంగాల్లో రాణిస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా జుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌వి విజయ్ నాయక్, ప్రధాన కార్యదర్శి బి.గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






