దారుణం.. ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం

by Malleboina Mahesh |

ఢిల్లీలో ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు.

దారుణం.. ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని అయిన ఢిల్లీలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gangrape) పాల్పడటం కలకలంగా మారింది. దీంతో ఢిల్లీలో మరోసారి మహిళా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు.

బాధితురాలు ఫిర్యాదుతో ఈ ఘోరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన రాజధాని నగరంలో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే మహిళల రక్షణపై ఆందోళనలను పెంచుతోంది. పోలీసులు ఈ కేసును వేగంగా విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Next Story