- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనస్పర్థల మధ్య విషాదం.. చెరువులో మహిళ మృతదేహం
కొడంగల్ మండలంలోని రావల్‌పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి సక్కమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దిశ, కొడంగల్: కొడంగల్ మండలంలోని రావల్‌పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి సక్కమ్మ (45) మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్షప్ప భార్య అయిన సక్కమ్మ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషించేది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో జరిగిన గొడవ అనంతరం సక్కమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని చెరువులో సక్కమ్మ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వేణుకుమార్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సక్కమ్మ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.






