విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

by Batti.Sumithra |

మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలోని చింతల గూడెంలో శనివారం విద్యుత్ షాక్కు గురై మహిల మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
X

దిశ, మాడుగులపల్లి ; మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలోని చింతల గూడెంలో శనివారం విద్యుత్ షాక్కు గురై మహిల మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి మెకానిక్ కోలగట్ల జాన్ రెడ్డి (సోమిరెడ్డి)భార్య కోలగట్ల అండమ్మ శనివారం తన ఇంట్లో హౌస్ మోటార్ ఆన్ చేసి నీటి సరఫరా కాకపోవడంతో మోటర్ ను పరిశీలిస్తుంది. ఈ సమయంలో ఆమెకు అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story