తనకు తానుగా గొంతు కోసుకున్న మహిళ.. ఎందుకంటే?

by Vinod kumar |

దిశ, వేలేరు: మతిస్థిమితం లేని మహిళ కూరగాయల - Woman commits suicide in Errabelli village

తనకు తానుగా గొంతు కోసుకున్న మహిళ.. ఎందుకంటే?
X

దిశ, వేలేరు: మతిస్థిమితం లేని మహిళ కూరగాయల కత్తి తీసుకుని.. గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎర్రబెల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వేలేరు ఎస్ఐ కె. నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రబెల్లి తండాకు చెందిన బాదావత్ శోభ(68) గత కొద్ది కాలంగా మతిస్థిమితం లేక తిరుగుతుందని.. ఒక సారి ఉరి వేసుకునే ప్రయత్నం చేసిందని, మరోసారి ఎలుకల మందు తినడం ఇలా రెండు సార్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే కాపాడడం జరిగిందని తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో కూరగాయల కత్తితో తనకు తాను గొంతు కోసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story