ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. గుండెపోటుతో సాక్షి మృతి

by Disha Web Desk 19 |
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. గుండెపోటుతో సాక్షి మృతి
X

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనమైన ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ముఖ్య సాక్షిప్రభాకర్ సెయిల్ మరణించారు. తన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు శనివారం పోలీసులు తెలిపారు. అయితే గుండెపోటు వచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది తుషార్ ఖండారే ధృవీకరించారు. గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ఈ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. ముంబైలోని అద్దె ఇంట్లో నివాసిస్తున్న ప్రభాకర్‌కు వివాహాం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో క్రూయిజ్ ఓడలో డ్రగ్స్ పార్టీ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు, పలు‌వురు ప్రముఖులు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రభాకర్‌తో పాటు మరికొందరు సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికీ ఈ కేసులో 20 మంది అరెస్ట్ కాగా, వీరిలో ఇద్దరే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మిగతా వారు బెయిల్‌పై బయటకు వచ్చారు.



Next Story

Most Viewed