Today's Horoscope:ధనుస్సు రాశిలో చంద్రుడి సంచారం.. ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

by Jakkula.Mamatha |

నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాల గురించి శుభవార్తలు అందుతాయి.

Todays Horoscope:ధనుస్సు రాశిలో చంద్రుడి సంచారం.. ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలో చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. నేడు ఇంద్ర యోగంతో పాటు పలు శుభ యోగాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ధనలాభాలు, విజయాలు కలగనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాల గురించి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కుటుంబంలో స్వల్ప విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

వృషభ రాశి

కుజుడు మీ రాశిలోనే ఉండటం వల్ల అపరిమితమైన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. దూరపు ప్రయాణాలు, చర్చలు అనుకూలిస్తాయి. అయితే, ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాల్లో బడ్జెట్ ప్లాన్ ముఖ్యం. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టండి. సుబ్రహ్మణ్య స్వామికి దీపం వెలిగించండి.

మిథున రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. అయితే, తొందరపాటు నిర్ణయాల వల్ల పనులు చెడిపోయే ప్రమాదం ఉంది. మీ మాటతీరుపై నియంత్రణ అవసరం. ఇష్ట దైవ ప్రార్థన చేసుకోండి.

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి పొదుపు పెరుగుతుంది. స్పెక్యులేషన్లు, వ్యాపారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో పూర్తి చేస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం శుభప్రదం.

సింహ రాశి

ఈరోజు మీకు అదృష్టకరమైన రోజు. ఆర్థిక ఇబ్బందులు ఏవీ ఉండవు. నూతన వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధైర్యసాహసాలతో చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

కన్య రాశి

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభంతో రోజంతా ఆనందంగా గడుపుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

తుల రాశి

ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం వల్ల అధికారుల ప్రశంసలు మరియు విజయావకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ఉన్న ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ వేడుకల్లో సంతోషంగా పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. కార్యసిద్ధి హనుమాన్ ఆరాధన ఉత్తమం.

వృశ్చిక రాశి

ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు లేదా అనుకూల మార్పులకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. లక్ష్మీ నరసింహ స్వామిని స్మరించుకోండి.

ధనస్సు రాశి

ఈరోజు మీకు శ్రేష్టమైన సమయం నడుస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఒక ముఖ్యమైన శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దత్తాత్రేయ స్వామిని పూజించండి.

మకర రాశి

ఉద్యోగంలో పనిభారం మరియు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డబ్బు విషయంలో ఏమరపాటుగా ఉండొద్దు; ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. నూతన ప్రయత్నాలను, పెట్టుబడులను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

కుంభ రాశి

మంచి ఆలోచనలతో చేసే పనులకు ఇతరుల మద్దతు, సహాయం లభిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవడం మంచిది. శివారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది.

మీన రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు, లాభాల రూపంలో ధన ప్రవాహం బాగుంటుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్టదేవతా స్మరణ శుభకరం.

Next Story