- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏరువాక ముందే వరద రాకపోతే.. ఈ ఏడాది రైతులకు నీటి కష్టాలు తప్పవా?
ఏరువాక పౌర్ణమి రాక ముందే కృష్ణా నదికి వరద వస్తే రైతుల సాగు చేసిన పంటలు సమృద్ధిగా దిగుబడి వస్తుందని ఈ ప్రాంత రైతుల నమ్మకం.

దిశ, మక్తల్: ఏరువాక పౌర్ణమి రాక ముందే కృష్ణా నదికి వరద వస్తే రైతుల సాగు చేసిన పంటలు సమృద్ధిగా దిగుబడి వస్తుందని ఈ ప్రాంత రైతుల నమ్మకం. సోమవారం ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు జరుపుకుంటున్న కృష్ణా నదికి వరదలు రాకపోవడంతో నదిలో రాళ్ళు కనిపిస్తున్నాయి. దీనితో ఈ ఏడాది రైతులకు నీటి కష్టాలు తప్పవని, వేసిన పంటల దిగుబడి రాక రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలంగాణ కర్ణాటక సరిహద్దు జిల్లాల రైతుల నమ్ముతుంటారు. ఏరువాక పండుగకు ముందు వర్షాలు కురిసి ఏటికి వరద వస్తే మక్తల్ నియోజకవర్గంలో బీమా ప్రాజెక్టు దిగువ సాగుతో అదనంగా చిన్న పెద్ద దాదాపు100కు పై చెరువులు నింపి అదనంగా 20 వేల ఎకరాలకు సాగు బడి లోకి వచ్చేది. గత సంవత్సరం ఏరువాక పౌర్ణమి వరకు కృష్ణా నదికి వరద రావడంతో నీటితో కళకళలాడిన. ఈ సంవత్సరం ఏరువాక పౌర్ణమి నాటికి సకాలంలో వర్షాలు కురవక నదికి వరదలు రాక నదిలో నీళ్లు లేక రాళ్లు తేలి వెలవెల పోతున్న దృశ్యంతో రైతులు తమ కష్టాలు తప్పవని ఈ ప్రాంత రైతులు రాబోయే భవిష్యత్తుని చెబుతున్నారు.
కర్ణాటక తెలంగాణ రాష్ట్రల సరిహద్దు జిల్లాలు ఉమ్మడి రాయచూర్, మహబూబ్నగర్, జిల్లాల రైతులు ఏరువాక పౌర్ణమిని వర్షాలు కురిసి విత్తనాలు సాగు నారుమడులతో రైతులు సంతోషంగా వైభవంగా జరుపుకుంటారు. వ్యవసాయ పనులు చేసే ఎద్దులను రంగురంగుల కాగితాలతో సుందరంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపుగా ప్రముఖ దేవాలయం వరకు రైతులు వెళ్లి పూజలు చేసి తమను దీవించాలని మొక్కుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఏరువాక పౌర్ణమి వచ్చిన వర్షాలు సమృద్ధిగా కురువాక కృష్ణా నదికి వరద రాక తమ పరిస్థితి ఏమిటని రైతులు దిగులుగా ఉన్నారు. ఆరుద్ర కార్తెలో వర్షాలు కురవకున్నా పెద్ద పుష్య కార్తెలో వర్షాలు కురుస్తాయని రైతుల నమ్మకం. దీంతో నాలుగు నెలల వర్షాకాలం సగం కాలం ముగిసిపోగా మిగిలింది రెండు నెలలే అని రైతులు ఆందోళన చెందుతున్నారు.






