పొలంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన శిక్షణ విమానం.. మహిళా పైలట్‌కు గాయాలు

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో సోమవారం సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం అత్యవసరంగా పొలంలో ల్యాండింగ్ చేసింది.

పొలంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన శిక్షణ విమానం.. మహిళా పైలట్‌కు గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో సోమవారం సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం అత్యవసరంగా పొలంలో ల్యాండింగ్ చేసింది. అలీగఢ్‌కు చెందిన చేతక్ ఏవియేషన్ సంస్థకు చెందిన సెస్నా-152 (VT-AFB) విమానం సోలో ఫ్లయింగ్ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ట్రైనీ పైలట్ కైనాత్ ఖాదర్ ఖాన్ విమానాన్ని హైవే సమీపంలోని పొలంలో అత్యవసరంగా దింపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం విద్యుత్ తీగలను ఢీకొనడంతో ముందు భాగం దెబ్బతింది. ప్రమాదంలో గాయపడిన మహిళా పైలట్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించగా, సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Next Story