- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటనకు వచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటనకు వచ్చారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన భోగాపురంలోని ‘పీఎం శ్రీ’ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వారికి ఘనస్వాగతం పలికారు.
పాఠశాల పరిశీలన – ముఖాముఖి
పాఠశాలలో అందుతున్న ఆధునిక విద్యా బోధన విధానాలను, డిజిటల్ తరగతులను, మౌలిక వసతులను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో నేరుగా ముఖాముఖి (ఇంటరాక్షన్) నిర్వహించి, విద్యా ప్రమాణాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగింది. మధ్యాహ్నం 3:00 గంటలకు.. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ (Central Tribal University) స్నాతకోత్సవంలో (Convocation) కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు.






