- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం–వరంగల్ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి
by Jakkula.Mamatha |
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ వైపు నుంచి ఖమ్మం దిశగా వస్తున్న లారీ, ఖమ్మం నుంచి గొల్లగూడెం వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మధుకాన్ గ్రానైట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






