- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులాలో మళ్లీమళ్లీ భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
వెనెజువెలాలో మళ్లీ 4.6 - 5.1 తీవ్రతతో వరుస భూప్రకంపనలు.. భయంతో వీధుల్లోనే ప్రజలు, కాలంతో పోటీపడుతూ అంతర్జాతీయ బృందాల సహాయక చర్యలు!

దిశ, వెబ్ డెస్క్: ఐదు రోజుల క్రితం దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో భూకంపం సృష్టించిన బీభత్సం నుండి ప్రజలు ఇంకా తేరుకోక ముందే, అక్కడ మళ్లీ వరుస భూప్రకంపనలు (Aftershocks) సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా రిక్టర్ స్కేలుపై 4.6 నుండి 5.1 తీవ్రతతో బలమైన భూప్రకంపనలు మళ్లీమళ్లీ సంభవించాయి. ఇప్పటికే గత వారం వచ్చిన భారీ భూకంపం కారణంగా వందలాది భవనాలు కుప్పకూలి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లడానికి సాహసించక, చిన్న పిల్లలతో సహా వీధుల్లోనే స్వచ్ఛందంగా కాలం గడుపుతున్నారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
గతవారం సంభవించిన భారీ భూకంపం ధాటికి కూలిపోయిన బహుళ అంతస్తుల భవనాల శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక విపత్తు నిర్వహణ బృందాలతో పాటు అంతర్జాతీయ రెస్క్యూ టీమ్‌లు కూడా రంగంలోకి దిగాయి. శిథిలాలను తొలగిస్తూ, లోపల ఉన్న వారిని ప్రాణాలతో కాపాడేందుకు ఈ బృందాలు కాలంతో పోటీ పడుతూ రెస్క్యూ ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి. అయితే, ఇప్పుడు మళ్లీ మళ్లీ వస్తున్న ప్రకంపనల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఎప్పుడు ఏ భవనం కూలుతుందో తెలియని పరిస్థితుల్లో వెనెజువెలా ప్రజలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.






