శివాజీ: 'లెనిన్' స్క్రీన్‌ప్లే సూపర్

by Pulgam srinivas |

లెనిన్ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శివాజీ అన్నారు.

శివాజీ: లెనిన్ స్క్రీన్‌ప్లే సూపర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సీనియర్ నటుడు శివాజీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న ఆయన, కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం 'బిగ్ బాస్' టెలివిజన్ షోలో పాల్గొని, దాని ద్వారా మళ్లీ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాజాగా అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన 'లెనిన్' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శివాజీ కూడా కీలక పాత్రలో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శివాజీ 'లెనిన్' సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అఖిల్ 'లెనిన్' మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నాడు. ఇందులో నాది చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్ర ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది" అని చెప్పారు. ఇటీవల శివాజీ నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో, 'లెనిన్' గురించి ఆయన ఎంతో నమ్మకంగా, సానుకూలంగా మాట్లాడటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Next Story