పేదలపై ‘హై టెన్షన్‌’ పిడుగు..

by Jakkula.Mamatha |

పవర్‌ గ్రిడ్‌ అధికారులు బీదర్‌ నుంచి మహేశ్వరం వరకు 765కేవీ హెచ్‌‌టీ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

పేదలపై ‘హై టెన్షన్‌’ పిడుగు..
X

రూపాయి రూపాయి పోగు చేసి కొనుగోలు చేసిన ప్లాట్లు అవి. డీటీసీపీ నుంచి లే అవు ట్‌‌కు అనుమతులు కూడా ఉండడం తో సొంతింటి కలను సాకారం చేసుకుందామనుకున్న ఆలోచనతో అనేకమంది పేదలు రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇంతలోనే వారి ఆశలపై పవర్‌ గ్రిడ్‌ అధికారులు నీళ్లు చల్లారు. జీపీకి ఇ చ్చిన 10శాతం ల్యాండ్‌‌లోనే ఏకం గా పోల్‌ ఏర్పాటు చేయడంతోపాటు ప్లాట్ల మీదుగా విద్యుత్‌ లైన్‌ పోతుండడంతో ప్లాట్ల యజమాను లు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ల భూములకు న్యాయం చేసేందుకు అలైన్‌ మెంట్‌ మార్చి మరీ అధికారులు 765 కేవీ హెచ్‌‌టీ లైన్‌‌ను ఏర్పాటు చేస్తున్నారని బాధితులు ఆ రోపిస్తున్నారు. సంబంధిత పనులను ఆపి వేయాలంటూ ప్రజా వాణిలో సోమవారం కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేసి నట్లు బాధితులు తెలిపారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో: పవర్‌ గ్రిడ్‌ అధికారులు బీదర్‌ నుంచి మహేశ్వరం వరకు 765కేవీ హెచ్‌‌టీ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పోల్స్​‍ నిర్మాణ పనులు జ రుగుతున్నాయి. అయితే ఈ పనులు ఓ వెంచర్‌‌లోని పేదల ప్లాట్ల మీదుగా చేపడుతుండడమే అసలు సమస్య. కడ్తాల్‌ పట్టణ సమీపంలోని సర్వే నెంబర్‌ 350పీ, 353పీ, 35 4పీ, 355పీ, 356పీ, 357పీలలోని సుమారు 20 ఎకరాల్లో జేఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్​‍ పేరుతో భారీ వెం చర్‌‌ను ఏర్పాటు చేశారు. శ్రీ ఇండి యా డెవలపర్స్​‍ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు వెంచర్‌‌ను డెవలప్‌ మెంట్‌ కోసం తీసుకుని మార్కెటిం గ్‌ చేశారు. వెంచర్‌‌లో ఉన్న 265 ప్లాట్లలో చాలా వరకు అమ్ముడు పో యాయి.

భవిష్యత్‌ అవసరాల కోసం ఒక్కో ప్లాట్‌ ను రూ.35 లక్షల వర కు వెచ్చించి వివిధ ప్రాంతాలకు చెందిన పేదలు కొనుగోలు చేశారు. అందులో కొన్ని ప్లాట్ల మీదుగా పవ ర్‌ గ్రిడ్‌ అధికారులు హెచ్‌ టీ లైన్‌ వే స్తుండడంతో వారి ఆశలపై పిడుగులు పడినట్లయింది. వెంచర్‌ చేసిన రియల్టర్‌‌కు సంబంధించిన భూము ల మీదుగా అలైన్‌‌మెంట్‌ ఉండగా.. రియల్టర్‌‌కు మేలు చేకూర్చేందుకు అధికారులు అలైన్‌‌మెంట్‌‌ను మార్చి పేదల ప్లాట్ల మీదుగా లైన్‌‌ను వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వకుండా.. కనీసం సమాచారం సైతం ఇవ్వకుండా పనులు చేయడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

కలెక్టరేట్‌‌లో ఫిర్యాదు..

కొద్ది రోజులుగా ప్లాట్ల వద్ద ఆందోళన చేస్తున్నప్పటికీ పవర్‌ గ్రిడ్‌ అధికారులు పనులు చేసుకుంటూ పోతుండడంతో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. వెంచర్‌ ఏర్పాటు సందర్భంగా గ్రామ పం చాయతీకి ఇచ్చిన 10శాతం స్థలంలోనూ పోల్‌‌ను ఏ ర్పాటు చేశారని, ఈ విషయమై సర్పంచ్ భిక్షపతికి, ఎంపీవో లాలయ్యకు ఫిర్యాదు చేసినట్లు ప్లాట్ల యజమానులు తెలిపారు. డీటీసీపీ లే అవుట్‌ అనుమతులు ఉండడంతో నమ్మకంతో ప్లాట్లను కొన్నామని, వెంచర్‌ చేసిన రియల్టర్‌ పవర్‌ గ్రిడ్‌ అధికారులతో కలిసి మోసం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కలెక్టరేట్‌ లో జరిగిన ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశా మని, కలెక్టర్‌ తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

చర్చలు జరుపుతున్నాం: పవర్‌ గ్రిడ్‌ సీనియర్‌ డీజీఎం

ప్లాట్ల మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళ్తుండటంతో ప్లాట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్లాట్ల యజమానులకు అన్యాయం జరగనివ్వకుండా చర్చలు జరుపుతున్నాం. మంగళవారం ఏం నిర్ణయం తీసుకునేది చెప్తామని పవర్‌ గ్రిడ్‌ సీనియర్‌ డీజీఎం సంతోష్‌ అన్నారు.

Next Story