టాలీవుడ్‌‌పై కన్నేసిన శనయా కపూర్.. ఆ యంగ్ హీరో సరసన బంపర్ ఆఫర్!

by Mallepaka Hamsa |

తెలుగు చిత్రాలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉండటంతో శనయా కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో ఒక క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్‌‌పై కన్నేసిన శనయా కపూర్.. ఆ యంగ్ హీరో సరసన బంపర్ ఆఫర్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి వచ్చిన శనయా కపూర్ తన గ్లామర్‌తో ఫుల్ ఫేమ్ రాబట్టుకున్నారు. గత ఏడాది ‘ఆఖోంకి గుస్తాకియా’ అనే రొమాంటిక్ డ్రామాతో హీరోయిన్‌గా మారిన ఆమె ఇటీవల ‘తు యా మై’ అనే సర్వైవల్ థ్రిల్లర్ చేసింది. అయితే, నటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో సరైన బ్రేక్ కోసం చూస్తున్న శనయా కపూర్, ఇప్పుడు టాలీవుడ్‌పై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు చిత్రాలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉండటంతో శనయా కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో ఒక క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ వినూత్న చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి-2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ హై-వోల్టేజ్ సీక్వెల్ సినిమాలో హీరోయిన్‌గా శనయా కపూర్‌ను ఎంపిక చేసినట్లు టాక్. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 'జాంబీ రెడ్డి' మొదటి భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతూనే నవ్వించిందో.. ఈ పార్ట్-2 కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా శనయా కపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెడితే, ఆమె కెరీర్‌కు ఇక్కడ గట్టి బ్రేక్ దొరికే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Next Story