- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Bigg Boss Season-8: ప్రసార టైమింగ్‌లో మార్పులు! డబుల్ ఎలిమినేషన్.. విన్నర్స్‌కు ప్రైజ్‌మనీతో పాటు మరో సర్‌ప్రైజ్..
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss Season-8) లో ఈసారి డబుల్ ఎలిమినేషన్(Double elimination) జరిగింది. శనివారం(Saturday) వచ్చిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజ(Tasty Teja).. నిన్న (అక్టోబరు 1) ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో పృథ్వీ(prudhvi) ఎలిమినేట్ అయి బయటికి వెళ్లిపోయారు. చివర వరకు విష్ణుప్రియ(Vishnu Priya) కూడా డేంజర్ జోన్‌లో ఉంది. కానీ పృథ్వీనే ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున(Nagarjuna) వెల్లడించారు. పృథ్వీ ఎలిమినేట్ అయినందుకు విష్ణుప్రియ ఎమోషనల్ అయి ఏడ్చేసింది.. మిస్ యూ. నిజంగా తను చాలా గొప్ప పర్సన్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక పృథ్వీ స్క్రీన్ పై తన బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ అయినప్పటినుంచి ఎలా ఉందో చూసుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు.
తన జర్నీలో గొడవలతో పాటు అమ్మాయిలతో ఫ్లర్టింగ్, విష్ణుప్రియాతో ప్రేమ, నిఖిల్(nikhil)తో ఫ్రెండ్‌షిప్ కూడా ఉన్నాయి. ఇకపోతే నాగార్జున బిగ్‌బాస్ సీజన్-8 ప్రారంభానికి ముందే ఈ సీజన్ మొత్తం ట్విస్టులుంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రతీసారి కప్పు కొట్టిన వారికి ప్రైజ్ మనీ(Prize money) ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రైజ్ మనీతో పాటుగా మారుతీ సుజుకీ ఈల్ న్యూ డ్యాజిలింగ్ డిజైన్(Maruti Suzuki Eel New Dazzling Design) కారును కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నారట. అలాగే గోల్డెన్ టికెట్(Golden ticket) వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లలకు స్పెషల్ ఆఫర్ కూడా ఉండనుందని సమాచారం. ఇక నేటి నుంచి (డిసెంబరు 2) ఈ సీజన్ రాత్రి 10 గంటల వరకు ప్రసారమవుతుందని నాగార్జున తెలిపారు.