భర్త అప్పులు... చైన్ స్నాచర్ గా మారిన భార్య

by Muthe.Rajitha |

భర్త చేసిన విపరీతమైన అప్పులకు భార్య దొంగగా మారిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

భర్త అప్పులు... చైన్ స్నాచర్ గా మారిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్ : భర్త చేసిన విపరీతమైన అప్పులకు భార్య దొంగగా మారిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అనితారెడ్డి అనే మహిళ బీటెక్ చదివి చెన్నైలో సాఫ్టేర్ ఉద్యోగం చేసేది. రెండేళ్ల క్రితం మేడ్చల్‌కు చెందిన రాజేష్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. భర్త చేసిన ఐదు లక్షల అప్పులు తీర్చేందుకు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మియాపూర్‌కు చెందిన నల్ల కమల అనే వృద్ధురాలు తన ఇంటికి వచ్చి లిఫ్ట్‌లో పైఅంతస్తుకు వెళ్లుతుండగా.. అక్కడే వేచి చూస్తున్న అనితారెడ్డి లిఫ్ట్ తలుపులు మూసుకునేలోపు లోపలికి చేతి పెట్టి ఆమె మెడలోని మంగళసూత్రం, నల్లపూసల గొలుసు తెంపేందుకు ప్రయత్నించింది.

బాధితురాలు కేకలు వేయడంతో చేతికందిన అర తులం నల్లపూసల గొలుసు తెంచుకుని నిందితురాలు పారిపోయింది. కాగా సనత్‌నగర్ పోలీసులు ఈకేసులో దర్యాప్తు చేపట్టగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనితారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story