- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య.. రూ.2 కోట్లకు ఆశపడి కటకటాల్లోకి
వాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను హత్య చేయించింది ఓ భార్య.

దిశ, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను హత్య చేయించింది ఓ భార్య. అతని పేరున ఉన్న రూ.2 కోట్ల బీమా సొమ్మును కాజేయడానికి తన ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించిన ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. మంచిర్యాల పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సాయిని కుమార్(45) ఈ నెల 22న బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి, కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. అయితే, ఈ మృతిపై కుమార్ తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు.
కుమార్ భార్య భారతికి అదే గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్‌తో వివాహేతర సంబంధం ఉండగా, తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ఏడాదిన్నర క్రితమే పథకం వేశారు. కుమార్ గనుక రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఎల్‌ఐసీతో పాటు వివిధ బీమా సంస్థల నుండి దాదాపు రూ.2 కోట్ల క్లెయిమ్ వస్తుందని ఆశపడి, భర్త పేరిట బీమా ప్రీమియంలు చెల్లిస్తూ వచ్చారు. ఈ క్రమంలో, తమకు అప్పుగా ఇచ్చిన డబ్బుల విషయంలో భర్తతో గొడవపడుతున్న రామ్ మల్లేష్ అనే వ్యక్తిని భారతి సంప్రదించి, భర్తను చంపేందుకు రూ.10 లక్షల సుపారీ మాట్లాడి రూ.2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. మల్లేష్ ఈ పని కోసం శ్రీరామ్ అనే మరో వ్యక్తిని జతచేర్చుకున్నాడు.
పథకం ప్రకారం ఈ నెల 22న ముల్కల్ల గ్రామ శివారులో కుమార్ కు అతిగా మద్యం తాగించిన మల్లేష్, శ్రీరామ్‌లు ఇనుప సుత్తితో అతని తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆపై దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుమార్‌ను, అతని బైక్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు. కుమార్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో.. విచారణ జరిపిన పోలీసులు, భారతి వ్యవహారశైలిపై నిఘా ఉంచి ఈ రోడ్డు ప్రమాదాన్ని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిరూపించారు. నిందితుల నుంచి బీమా పత్రాలు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకుని భారతి, సురేందర్, శ్రీరామ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రామ్ మల్లేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.






